జుకర్ బర్గ్ సోదరికి విమానంలో వేధింపులు.. 3 గంటల పాటు భరించిందట..

శనివారం, 2 డిశెంబరు 2017 (11:14 IST)
మహిళలపై వేధింపులు ఎక్కడపడితే అక్కడి జరిగిపోతున్నాయి. రోడ్డుపై నడిచే బస్సుల నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల వరకు మహిళపై వేధింపులు సర్వసాధారణమైపోయాయి. సామాన్య మహిళలపైనే కాదు.. సెలెబ్రిటీలు, ప్రముఖులైన మహిళలపై కూడా వేధింపులకు గురిచేసే కామాంధులు ఎక్కువైపోతున్నారు. తాజాగా ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ సోదరి విమానంలో మూడు గంటల పాటు వేధింపులకు గురైంది. అలాస్కా ఎయిర్‌ లైన్స్‌‌లో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ సోదరి రాండీ జుకర్‌ బర్గ్‌‌కు వేధింపులు తప్పలేదు.
 
వివరాల్లోకి వెళితే.. ఫేస్‌బుక్ మార్కెటింగ్ డైరక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాండీ జుకర్ బర్గ్ అలాస్కా ఎయిర్‌ లైన్స్‌‌కి చెందిన విమానంలో మెక్సికోకు ప్రయాణించారు. ఆ సమయంలో విమానంలో తన పక్క సీట్లో కూర్చున్న ఓ ప్రయాణీకుడు మందు తాగి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని విమాన సిబ్బందికి చెప్పినా వారు పట్టించుకోలేదని రాండీ జుకర్ బర్గ్ ట్విట్టర్లో వెల్లడించారు. 
 
అంతేగాకుండా అతడు రెగ్యులర్ కస్టమరి సిబ్బంది తెలిపారట. ఇంకా అడిగిన మద్యం ఇస్తున్నారని ఆమె తెలిపారు. దీంతో మూడు గంటలపాటు అతని వేధింపులను భరించాల్సి వచ్చిందని సోషల్ మీడియా పోస్టులో రాండీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి అలస్కా ఎయిర్ కార్పొరేట్ స్టాఫ్‌కు మెయిల్ చేసినట్లు ఆమె తెలిపారు. దీనిపై అలాస్కా ఎయిర్ లైన్స్ సంస్థ ప్రతినిధి ఎగన్‌ స్పందిస్తూ, రాండీ వేధింపుల ఘటనపై దర్యాప్తు చేపడతామని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు