ప్రపంచ అగ్రదేశాలైన రష్యా, అమెరికాల మధ్య మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. గత కొంతకాలంగా ఈ రెండు దేశాల మధ్య వైరం తారా స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో రష్యా టెలివిజన్ గ్రూప్ ఆర్‌టీ అమెరికా కాంగ్రెస్‌ను ప్రసారం చేసే హక్కులు కోల్పోయింది. దీంతో అసంతృప్తికి గురైన రష్యా.. అమెరికాకు కౌంటర్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.
పార్లమెంట్‌లోని ఎగువసభ, దిగువ సభ ఆమోదం పొందితే అమెరికా జర్నలిస్టులు రష్యా పార్లమెంట్ సమావేశాలను ప్రసారం చేయకుండా నిషేధం విధించే అవకాశం ఉంది. రష్యా అధ్యక్షుడు కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్లు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.