మెక్సికోలో 1500 సంవత్సరాల నాటి పురాతన మాయన్ నగరం

మంగళవారం, 31 మే 2022 (09:55 IST)
మెక్సికోలో పురాతన మాయన్ నగరాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వివరాల్లోకి వెళితే.. మెక్సికోలోని యుకాటన్ ప్రాంతానికి ఈశాన్య తీరంలో మెరిడా పట్టణం ఉంది. ఆ పట్టణానికి సమీపంలో ఒక పారిశ్రామిక ప్రాజెక్ట్‌ కోసం ఓ ప్రైవేటు స్థలాన్ని కేటాయించారు. 
 
పురావస్తు శాస్త్రవేత్తలు ఆ స్థలంలో తవ్వకాలు జరిపారు. ఇక వారికి షాక్ కలిగించేలా రాజభవనాలు, పిరమిడ్‌లతో కూడిన సుమారు 1500 సంవత్సరాల నాటి ఓల్డ్ మయాన్ నగరం ఒకటి బయటపడింది. 
 
ఆ రాజభవనాలు, పిరమిడ్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన శాస్త్రవేత్తలు.. వీటిల్లో వివిధ సామాజిక తరగతులకు చెందిన వ్యక్తులు ఉండి ఉంటారని.. పూజారులు, లేఖకులు.. రాజభవనాల్లో ఉండగా.. సాధారణ ప్రజలు మిగిలిన వాటిల్లో నివసించి ఉంటారని ఒక కన్‌క్లూజన్‌కు వచ్చారు.
 
ఆ ప్రైవేటు భూమిని సొంతం చేసుకున్న యజమానుల్లో ఒకరైన మౌరిసియో మోంటల్వో, తవ్వకాలు జరుపుతున్నప్పుడు భారీ శబ్దంతో ఓ పెద్ద రాయి మట్టిలో తగిలిందని.. ఆ తర్వాత ఈ అపారమైన భవనాలను వెలికితీశామని చెప్పుకొచ్చాడు.
 
కాగా, ఆ వ్యక్తి కొనుగోలు చేసిన స్థలంలో ఈ పురాతన రాజభవనాలను కనుగొనడంతో అతడు నేషనల్ ఇన్‌స్టిట్యుట్‌ ఆఫ్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ(INAH)కు ఆ సైట్‌ను అప్పగించేశాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు