టైటానిక్ సబ్‌మెరైన్ శకలాల గుర్తింపు.. టైటానిక్ ఓడ పక్కనే.. ఆక్సిజన్..?

గురువారం, 22 జూన్ 2023 (22:44 IST)
Titanic submersible
అట్లాంటిక్ మహాసముద్రంలో గల్లంతైన టైటానిక్ సబ్‌మెరైన్ ఆచూకీ కోసం రెస్యూ పనులు జరుగుతున్నాయి. ఈ జలాంతర్గామి కనిపించకుండా పోయి 96 గంటలు దాటిన నేపథ్యంలో శిథిలాలను గుర్తించినట్లు యుఎస్ కోస్ట్ గార్డ్ తెలిపింది. 
 
టైటానిక్ ఓడ శిథిలాల పక్కనే టైటాన్ శకలాలను గుర్తించినట్లుగా తెలుస్తోంది. టైటాన్‌ను వెతికేందుకు పంపిన రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్ కొన్ని టైటాన్ శకలాలను గుర్తించినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ ట్వీట్ చేసింది. 
 
ఇకపోతే.. జలాంతర్గామి సముద్ర ఉపరితలం నుండి 12,500 అడుగుల లోతున ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అమెరికా, కెనడా యుద్ధ విమానాలు, ఉపగ్రహాలు, భారీ నౌకలను రంగంలోకి దించి సముద్రాన్ని జల్లెడ పడుతున్నాయి. టైటాన్ జలాంతర్గామిలో ఆక్సిజన్ సరఫరా గురువారం సాయంత్రానికి పూర్తయ్యే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు