ఒక ఉద్యోగిని ఉన్నట్టుండి ఉద్యోగం నుండి తీసేయడానికి చాలా కారణాలుంటాయి. కానీ బురఖా ధరించిందనే కారణంతో ఓ మహిళను ఉద్యోగం నుంచి ఊడపీకిన ఘటన వర్జీనియాలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... వర్జీనియాకు చెందిన నజఫ్‌ఖాన్ ఫెయిర్ ఓక్స్ డెంటల్ కేర్‌లో అసిస్టెంట్‌టుగా విధులను నిర్వహిస్తుంది. ఉద్యోగానికి మొదటి రెండు రోజులు సాధారణ రీతిలోనే దుస్తులు వేసుకుని వెళ్లింది.