బలూచిస్థాన్ మహిళల పరిస్థితి దారుణంగా ఉంది. పాకిస్థాన్ సైన్యం చేతుల్లో వారి బతుకు ఛిద్రమైపోతోంది. ధనమే కాదు, మాన, ప్రాణాలు, చివరికి శరీరంలోని అవయవాలు కూడా సైనిక ముష్కరుల దౌర్జన్యాలకు విలవిలలాడుతున్నాయి. బలూచ్ కుర్ద లిబరేషన్ కార్యకర్త, ప్రపంచ బలూచ్ మహిళల వేదిక అధ్యక్షురాలు నయేలా ఖాద్రి బలోచ్ మాటల్లో బలూచిస్థాన్ మహిళలు అనుభవిస్తున్న దారుణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మమ్మల్ని చంపడానికి, మామీద అత్యాచారాలు చేయడానికి, హింసించడానికి, మా శరీరాల్లోని అవయవాలను తొలగించి, అమ్ముకోవడానికి పాకిస్థాన్ సైన్యానికి లైసెన్స్ ఉందన్నారు. పాకిస్థాన్ సైన్యం బలూచ్ ప్రజల అవయవాల వ్యాపారం చేస్తోంది. దీనికి ఎధి ఫౌండేషన్ సహకారం ఉందని ఆరోపించారు.
పాకిస్థాన్ రేప్ సెల్స్‌ను నడుపుతోందని... బలూచిస్థాన్ మహిళలను అపహరించి వీటిలో ఉంచి, రేప్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. సాధారణ మానవులెవరూ ఊహించ శక్యం కాని దౌర్జన్యాలకు పాకిస్థాన్ సైన్యం పాల్పడుతోందని నయేలా ఖాద్రి తెలిపారు.