అంగారకుడిపై మనుషుల్ని తీసుకెళ్లేలా సరికొత్త ఇంజిన్: నాసా

సోమవారం, 6 ఏప్రియల్ 2015 (10:42 IST)
కేవలం 39 రోజుల్లో అంగారకుడిపైకి మనుషులను అంగారకుడిపై తీసుకెళ్లేందుకు వీలుగా నాసా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. భవిష్యత్‌లో మానవ నివాసాలకు ప్రణాళికలు రూపొందిస్తున్న నాసా సాధ్యమైనంత తక్కువ సమయంలో అక్కడికి మానవులను, వస్తువులను తీసుకువెళ్లేలా సరికొత్త ఇంజన్‌ను అభివృద్ధి చేస్తోంది. 
 
కేవలం 39 రోజుల్లో ఈ ఇంజన్‌తో కూడిన అంతరిక్ష నౌకలో పంపాలన్నది నాసా అభిమతం. సెకనుకు 66.8 కి.మీల దూరం పయనించేలా వేరియబుల్ స్పెసిఫిక్ ఇంపల్స్ మేగ్నటో ప్లాస్మా రాకెట్ ఇంజన్ (వాసిమిర్ ఇంజన్) పేరిట దీన్ని తయారు చేస్తున్నారు.

ఇందుకోసం టెక్సాస్‌‌కు చెందిన ఏడ్ ఆస్ట్రా రాకెట్ సంస్థకు 10మిలియన్ అమెరికన్ డాలర్లను నాసా మంజూరు చేసింది. ఈ రాకెట్ తయారీ పూర్తయితే అంగారక యాత్ర మరింత సులభం కానుంది.

వెబ్దునియా పై చదవండి