దొంగచాటుగా లండన్‌ వెళ్లిపోయిన నవాజ్ షరీఫ్?

శనివారం, 21 ఏప్రియల్ 2018 (17:02 IST)
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ దొంగచాటుగా లండన్ పారిపోయినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే, ఆయన అనుచరులు మాత్రం లండన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భార్యను చూసేందుకే ఆయన లండన్ వెళ్లారని చెపుతున్నారు.
 
అక్రమ రహదారి నిర్మాణానికి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఎన్‌ఏబీ షరీఫ్‌కు సమన్లు జారీచేసింది. అవినీతి ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు ప్రధాని షరీఫ్‌పై అనర్హత వేటువేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రధాని పీఠాన్ని త్యజించారు. 
 
ఈ పరిస్థితుల్లో నవాజ్ షరీఫ్ తన కుమార్తెతో కలిసి లండన్ వెళ్లారు. క్యాన్సర్ బారిన పడి లండన్ దవాఖానలో చికిత్స పొందుతున్న తన భార్య బాగోగులు చూసుకోవడానికి వెళ్లినట్టు సమాచారం. ఆయన తిరుగు ప్రయాణంపై ఎలాంటి సమాచారం లేదు. 
 
మరోవైపు, ఈ నెల 21వ తేదీన లాహోర్‌లోని నేషనల్ ఎకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఏబీ) సంయుక్త దర్యాప్తు బృందం ఎదుట ఆయన హాజరుకావాల్సి ఉంది. అలాగే, 23వ తేదీన అవినీతి కేసులో కూడా ఏప్రిల్ 23వ తేదీన ఆయన కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉన్నది. దాని నుంచి తప్పించుకొనేందుకు దేశాన్ని వీడారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే, ఆయన తిరిగి ఇస్లామాబాద్‌కు వచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు