గత నెల 20న పార్లమెంటును రద్దు చేసిన ప్రధాని ఓలి.. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆయన నిర్ణయంతో పుష్పకమల్ దహల్, ఓలి వర్గాలుగా పార్టీ చీలిపోయింది. ప్రధాని నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న దహల్ వర్గం ఆదివారం సమావేశమైంది.
ఆయనిక పార్టీలో సభ్యుడు కాదు కాబట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాని తన తప్పును తెలుసుకుని సరిదిద్దినా ఆయనతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. కాగా, రెండుగా చీలిపోయిన కమ్యూనిస్ట్ పార్టీపై పూర్తి హక్కు తమకే ఉంటుందని ఇరు వర్గాలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.
కాగా, కేపీ శర్మ ఓలి ఇటీవలి కాలంలో భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించారు కూడా. ముఖ్యంగా డ్రాగన్ కంట్రీ చైనాతో కలిసి నేపాల్ దేశ సరిహద్దులను మార్చేందుకు ప్రయత్నించారు. ఇందులోభాగంగా, నేపాల్ సరికొత్త మ్యాప్‌ను రిలీజ్ చేశారు. ఇందులో భారత్‌కు చెందిన పలు ప్రాంతాలను నేపాల్‌కు సొంతమైనవిగా ప్రకటించారు. ఇది ఇరు దేశాల మధ్య పెద్ద దుమారమే చెలరేగిన విషయం తెల్సిందే.