ఈ బిల్లును సెనెటర్ అలెక్స్ పాడిల్లా ప్రతిపాదించగా, ఇతర సెనెటర్లు ఎలిజబెత్ వారెన్, బెన్‌రాయ్ లుజాన్, డిక్ దుర్బిన్ మద్దతు పలికారు. అమెరికా ప్రజా ప్రతినిధుల సభలోనూ ఈ బిల్లును ప్రవేశపెట్టారు కాంగ్రెస్ ఉమన్ జో లాఫ్‌గ్రెన్.
ఈ బిల్లు చట్టంగా మారితే ప్రస్తుతం హెచ్-1బీ వీసాపై పని చేస్తున్న వారితో సహా 80 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. ఇందులో హెచ్-1బీ వీసా దారులు, దీర్ఘకాలం వీసాపై పనిచేస్తున్న నిపుణుల పిల్లలు, గ్రీన్ కార్డు డ్రీమర్లు, తదితరులకు గ్రీన్ కార్డు లభిస్తుంది.