మళ్లీ ఎబోలా కలకలం: మూడేళ్ల బాలుడికి పాజిటివ్‌గా నిర్ధారణ

శనివారం, 9 అక్టోబరు 2021 (15:57 IST)
మళ్లీ ఎబోలా కలకలం మొదలైంది. కాంగోలో మళ్లీ ఎబోలా కేసు నిర్ధారించబడింది. 2018-2020 వ్యాప్తికి కేంద్రబిందువులలో ఒకటైన తూర్పు నగరం బెని సమీపంలో తాజాగా 3 ఏళ్ల బాలుడు ఎబోలా పాజిటివ్‌గా పరీక్షించబడ్డాడు. 
 
అతడు బుధవారం నాడు ఈ వ్యాధితో మరణించినట్లు ఆరోగ్య మంత్రి జీన్ జాక్వ్స్ మ్బుంగాని ఒక ప్రకటనలో తెలిపారు. వైరస్ బారిన పడిన దాదాపు 100 మంది వ్యక్తులు గుర్తించబడ్డారు. వారిలో ఏవైనా లక్షణాలు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకుంటూ ఉన్నామని అన్నారు.
 
కాంగో యొక్క బయోమెడికల్ లాబొరేటరీ నుండి వచ్చిన అంతర్గత నివేదిక ప్రకారం.. బుట్సిలి పరిసరాల్లోని పసిపిల్లలలో ముగ్గురు కూడా గత నెలలో ఎబోలాకు సంబంధించిన లక్షణాలతో మరణించారని అంటున్నారు. తీవ్రమైన వాంతులు మరియు విరేచనాలు కలిగిస్తుంది. ఈ వ్యాధి 1976లో ఎబోలా నదికి సమీపంలో ఉన్న అడవిలో కనుగొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు