కాంగోలో ఇటలీ రాయబారి దారుణ హత్య

మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (16:42 IST)
Italian Ambassador
కాంగోలో ఇటలీ రాయబారి దారుణ హత్యకు గురయ్యారు. గోమా పట్టణంలో శాంతి స్థాపనకు కృషి చేస్తున్న రాయబారి లూకా అటాన్సియాపై సాయుధులు కాల్పులకు తెగబడ్డారు. ఐక్యరాజ్య సమతి తరపున చర్చల కోసం ఆయన వెళ్తున్న కాన్వాయిపై దుండగులు దాడికి తెగబడ్డారు. ఆ సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా లూకాతో పాటు మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. 
 
మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
 
సహజ వనరులు పుష్కలంగా ఉంగే కాంగో ప్రస్తుతం అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. కాగా శాంతి స్థాపనకు ఐక్యరాజ్య సమితి కృషి చేస్తోంది. అయితే, అది సహించని తిరుగుబాటు బృందాలు ప్రముఖులపై దాడికి తెగబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటలీ రాయబారిని హత్య చేసినట్లు అధికారులు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు