నైజీరియాలోని చర్చిలో తొక్కిసలాట - 31 మంది మృత్యువాత

ఆదివారం, 29 మే 2022 (11:55 IST)
ఆఫ్రికా దేశాల్లో అత్యధిక ముడి చమురును ఉత్పత్తి చేస్తూ దేశాల్లో నైజీరియా ఒకటి. ఈ దేశంలో ప్రధాన చమురుక్షేత్రం ఉన్న పోర్ట్ హార్‌కోర్ట్‌లోని చర్చి లోపలిభాగంలో తొక్కిసలాట సంభవించింది. ఇందులో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు 31 మంది చనిపోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
శనివారం ఈ చర్చివద్ద కొంతమంది దాతలు చారిటీ ఈవెంట్‌లో భాగంగా ఆహార పదార్థాలు, ఇతర కానుకనులను ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో పెద్ద సంఖ్యల ప్రజలు దూసుకుని రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని అధికారులు వెల్లడించారు. 
 
ఆహార పదార్థాలు, బహుమతులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారన్న ప్రచారంతో చర్చి వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే, జనం ఒక్కసారిగా ఎగబడటంతో రద్దీ ఎక్కువై తొక్కిసలాట సంభవించింది. దీంతో 31 మంది చనిపోగా, మరో ఏడుగురు గాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు