ఇదో వైపు జరుగుతున్న దేశంలో అత్యాచారాలు, లైంగిక నేరాల సంఖ్య పెరిగిపోతోంది. ఇలాంటి తరుణంలో కాంగో దేశానికి చెందిన డెన్నిస్ ముక్వెగెతో పాటు యాజిది వర్గానికి చెందిన అత్యాచార బాధితురాలు నదియా మురాద్లకు నోబెల్ అవార్డు దక్కింది. ఫిజియన్ అయిన డెన్నిస్ లైంగిక దాడుల బాధితులైన వేలాది మందిని ఆదుకున్నారు.
కాంగోలో జరిగిన అంతర్యుద్ధం సమయంలో ఎన్నో అరాచకాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఆయన బాధితులకు అండగా ఉండి పోరాటాలు చేశారు. ఈ నోబెల్ శాంతి అవార్డును పంచుకున్న నదియా మురాద్ ఓ అత్యాచార బాధితురాలు. తన వంటి బాధితుల తరపున ఆమె అనేక పోరాటాలు చేశారు. తనకు జరిగిన అన్యాయంపై 23 ఏళ్ల వయస్సులోనే ఆమె ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగించారు.