నిమ్మరసం, రోజ్ వాటర్‌తో.. జుట్టు పెరుగుతుందా..?

బుధవారం, 3 అక్టోబరు 2018 (12:09 IST)
కొంతమంది జుట్టు రాలిపోతుందని రకరకాల నూనెలు, షాంపూ వాడుతుంటారు. వీటిని వాడినా ఎటువంటి ఫలితం లేదు. మరి ఏం చేయాలి.. అంటూ ఆలోచిస్తుంటారు. మరికొందరైతే వైద్య చికిత్సలు కూడా తీసుకుంటుంటారు.. జుట్టు పెరిగేందుకు.. అయినా కూడా జుట్టు రాలిపోతూనే ఉందంటూ ఆందోళన చెందుతుంటారు.

 
ఈ చిట్కాలు పాటిస్తే జుట్టు రాలిపోదట.. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం. నిమ్మకాయలు జుట్టు పెరడానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఈ కాలంలో ఇవి ఎక్కువగానే దొరుకుతాయి. కనుక ఎటువంటి సమస్య ఉండదు. కాబట్టి నిమ్మరసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని తలకు రాసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో తలస్నానం చేయాలి. 
 
ఇలా వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలానే చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆలివ్ నూనె ఆరోగ్యానికే కాదు జుట్టు సంరక్షణకు మంచిగా ఉపయోగపడుతుంది. ఆలివ్ నూనెను తలకు రాసుకుని 10 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచుగా చేస్తే కూడా జుట్టు రాలదు.
 
గుడ్డు తెల్లసొనలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తలకు రాసుకోవాలి. 45 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు క్రమం తప్పకుండా చేస్త మంచి ఫలితం ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు