నోబెల్ శాంతి బహుమతి వేలం - రూ.800 కోట్లు పలికిన ధర

మంగళవారం, 21 జూన్ 2022 (12:52 IST)
నోబెల్ బహుమతికి వేలం పాటలు నిర్వహించారు. దీనికి రికార్డు స్థాయిలో ధర పలికింది. రష్యా జర్నలిస్టు దిమిట్రీ మురతోవ్ తనకు వచ్చిన నోబెల్ బహుమతిని వేలం వేయగా, దీని ధర రూ.800 కోట్లుగా పలికింది. ఉక్రెయిన్‌లోని చిన్నారుల సంక్షేమం కోసం ఈ వేలం పాటలను నిర్వహించారు. ఈ వేలం పాటతో గతంలో ఉన్న అన్ని రికార్డులు బద్ధలైపోయాయి. 
 
కాగా, గత 2014లో జేమ్స్ వాట్సన్ తన నోబెల్ బహుమతిని విక్రయించారు. 1962లో ఈ బహుమతిని పొందారు. దీని ధర అప్పట్లో అత్యధికంగా రూ.4.76 మిలియన్ డాలర్లు పలికింది. అక్టోబరు 2021లో మురతోవ్ నోబెల్ పురస్కారాన్ని అందుకోగా, దీన్ని తాజాగా వేలం వేశారు.
 
ఉక్రెయిన్‌పై దాడి నేప‌థ్యంలో ర‌ష్యా త‌మ దేశంలోని జ‌ర్న‌లిస్టుల‌పై కొర‌ఢా రుళిపించిన విష‌యం తెలిసిందే. ఉక్రెయిన్‌లోని చిన్నారుల సంక్షేమం కోసం నోబెల్ శాంతి బ‌హుమ‌తిని వేలం వేయాల‌ని ముర‌తోవ్ నిశ్చ‌యించారు. 5 ల‌క్ష‌ల డాల‌ర్ల క్యాష్ అవార్డును కూడా ఆయ‌న ఛారిటీకి ఇచ్చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు