మీటింగ్‌లో నిద్రపోయాడనీ... మిషన్‌ గన్‌‌తో కాల్చి చంపిన కిమ్

బుధవారం, 31 జనవరి 2018 (10:51 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్... తనకు వ్యతిరేకంగా పని చేసే వారిని మట్టుబెట్టడంలోనూ ఆరితేరిన సిద్ధహస్తుడు. తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్న అక్కసుతో సొంత కుటుంబీకులనే హతమార్చిన ఘనడు. 2016లో తన అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఓ అధికారిని నిద్రపోయాడనీ అతని హై క్యాలిబర్ మిషన్ గన్‌తో కాల్చి చంపాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ భీతిగొలిచే చర్యను పరిశీలిస్తే,
 
2016 ఆగస్టులో కిమ్ జాంగ్ ఉన్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కు రియాంగ్ జిన్ అనే ఉన్నత శ్రేణి విద్యాశాఖ అధికారి వెళ్లారు. ఈ సమావేశంలో కిమ్ మాట్లాడుతున్న సమయంలో రియాంగ్ జిన్ నిద్రపోయాడు. దీంతో ఆగ్రహం ముంచుకొచ్చిన కిమ్ హై క్యాలిబర్‌ మిషన్‌ గన్‌‌తో ఆ సమావేశంలోనే అతని శరీరం తూట్లుపడేలా కాల్చి చంపించినట్టు సమాచారం. ఇలాంటి సంఘటనలు గతంలోనూ అనేకం జరిగాయి. 
 
గతంలో రక్షణ మంత్రిగా పని చేసిన హోంగ్‌ యోంగ్‌ చోయ్‌ కూడా కిమ్ నిర్వహించిన సమావేశంలో కునుకు తీశాడు. పైగా, ఆ సమావేశంలో కిమ్ చేసిన సూచనలు ఆయన అమలు చేయలేదు. దీంతో అతనిని యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్‌తో కాల్చి చంపించాడు. అలాగే, కిమ్‌ దగ్గరి బంధువైన జనరల్‌ జాంగ్‌ సాంగ్‌ను ఉరితీయించాడు.

ఆయన వారసులను కూడా శిక్షించాడు. ఇక ఆయన భార్య తన భర్తను కిమ్ హత్య చేశాడని ఆరోపించడంతో విషప్రయోగంతో చంపేశాడు. చైనా పారిపోయి తలదాచుకున్న సవతి సోదరుడు కిమ్ జాంగ్ నామ్‌ను మలేషియా రాజధాని కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో విషప్రయోగంతో హతమార్చాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు