అలాగే హయత్ నగర్‌లో ఓ విద్యార్థిని అనూష హత్యకు గురైంది. ఈమెను అమానుషంగా హత్య చేశారు. బండతో మోదడంతో ఈమె మరణించినట్లు పోలీసులు తెలిపారు. శనివారం చందానగర్‌లో మూడు హత్యలు కలకలం రేపిన నేపథ్యంలో మరో ఇద్దరు యువతులు దారుణంగా హత్యకు గురికావడంపై మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మహిళలకు భాగ్యనగరంలో భద్రత కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
హయత్ నగర్‌లో హత్యకు గురైన యువతి వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన అనూష, హైదరాబాదులో వుంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుందని.. ఇటీవలే మోహన్ అనే వ్యక్తితో ఆమెకు పెళ్లి కూడా కుదిరిందని చెప్పారు. అయితే ఇంతలో హత్యకు గురవడం వెనుక మోహన్ హస్తం ఏమైనా వుందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.