ఆర్థిక కష్టాల్లో ఉత్తర కొరియా... అన్నం కోసం ఆయుధాల విక్రయం

గురువారం, 5 అక్టోబరు 2017 (12:06 IST)
నిన్నమొన్నటివరకు ప్రపంచ దేశాలను ధిక్కరించిన ఉత్తర కొరియా ఇపుడు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. అమెరికా, ఐక్యరాజ్యసమితి ఆంక్షలు నార్త్ కొరియాను కుంగదీస్తున్నాయా. ఫలితంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు ఆయుధాలు అమ్ముకునే పరిస్థితి ఉత్పన్నమైంది. 
 
ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా వరుస క్షిపణి పరీక్షలను నిర్వహించింది. ముఖ్యంగా... అగ్రరాజ్యం అమెరికాను లక్ష్యంగా చేసుకుని ఈ పరీక్షలు నిర్వహించింది. ఏకంగా అణు పరీక్షను కూడా జరిపింది. ఈ చర్యతో ప్రపంచ దేశాలు భగ్గుమన్నారు. అదేసమయంలో ఉత్తర కొరియాపై ఆర్థిక ఆంక్షలు పెరిగాయి. 
 
ఈనేపథ్యంలో అమెరికా వ్యతిరేక దేశాలకు నార్త్ కొరియా ఆయుధాల అమ్మకం జరుపుతోందట. అమెరికాపై విరుచుకుపడుతున్న నార్త్ కొరియా… అగ్రరాజ్య వ్యతిరేక దేశాలతో ఆయుధాల వ్యాపారం చేస్తుందట. క్షిపణి పరీక్షలకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు ఆయుధాల వ్యాపారం చేస్తుందట. తాజాగా వాషింగ్టన్ పోస్ట్‌లో వచ్చిన కథనం ఇలాంటి సందేహాలనే రేకెత్తిస్తోంది.
 
2016 ఆగస్టులో ఈజిఫ్టు అధికారులు సుయాస్ కెనాల్‌లో దాడి చేసి ఉత్తర కొరియాకు చెందిన నౌకను సీజ్ చేశారు. దీంట్లో దాదాపు 30 వేల రాకెట్ ప్రొపైల్డ్ గ్రనేడ్లను గుర్తించారు. కంబోడియా జాతీయ పతాకం రంగులో ఉన్న ఈ నౌకకు సంబంధించిన సమాచారాన్ని అమెరికా అధికారులు సేకరించి ఈజిప్టుకు అందజేశారు. ఈ నౌకలోని ఆయుధాలు ఎక్కడికి చేరవేస్తున్నారో తెలియకపోయినా… ఈజిఫ్టులో ఓ ఆయుధాల వ్యాపారికి చేరవేస్తున్నట్టు తేలింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు