మా దేశంపైకి దండెత్తితే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం : ఉత్తర కొరియా హెచ్చరిక

సోమవారం, 9 మే 2016 (17:14 IST)
తమ దేశంపైకి ఏ ఒక్కరూ దండెత్తి రానంతవరకు తాము అణ్వాయుధాలను ప్రయోగించబోమని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్పష్టం చేశారు. పార్టీ ఆఫ్ కొరియా ఏడో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ... తమ జోలికి రానంతవరకూ తాము ఎవరి పైనా అణ్వాయుధాలు ప్రయోగించమని ప్రకటించారు. 
 
అయితే, తమ దేశంపైకి ఎవరైనా దండెత్తి వచ్చి తమ సార్వభౌమాధికారాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తే తప్ప అణ్వాయుధాలను బయటకి తీయబోమన్నారు. తాము అణు కార్యక్రమాన్ని ఎంతో విశ్వసనీయతతో ముందుకు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. అలాగే ఐక్యరాజ్య సమితి విధించిన ఆంక్షలను ఏమాత్రం పట్టించుకోబోమని తేల్చి చెప్పింది. 
 
అణ్వాయుధ రహిత ప్రపంచం అవతరించేందుకు తమ ప్రయత్నం ఉంటుందన్నారు. ప్రపంచంలోని తమ శత్రుదేశాలపై కూడా తమకు గౌరవముందని, అకారణంగా ఆ దేశాలపై తాము అణ్వాయుధాలను ప్రయోగించబోమని ఆయన స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి