ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. 108 సంవత్సరాల కాలంలో అతిపెద్ద..?

సోమవారం, 12 జులై 2021 (21:49 IST)
Northern California
అమెరికాలో ఉత్తర కాలిఫోర్నియాలోని బ్యాక్ వర్త్ కాంప్లెక్స్ రీజియన్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. గత 108 సంవత్సరాల కాలంలో అతిపెద్ద కార్చిచ్చు చెలరేగటం ఇదే తొలిసారి. కార్చిచ్చు కారణంగా లక్షలాది ఎకరాల్లో అటవీ సంపద దగ్ధమౌతుంది. మరోవైపు తీవ్రమైన వేడిగాలుల కారణంగా డెత్ వ్యాలీ జాతీయ పార్క్ పరిసరాల్లో ఉష్ణోగ్రతలు 54 డిగ్రీల సెల్సీయస్ కు చేరుకున్నాయి.
 
కాలిఫోర్నియాలోని ఉత్తర పర్వత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగటంతో ముందు జాగ్రత్త చర్యగా 518 చదరపు మైళ్ళ పరిధిలోని ప్రజలకు అధికారులు ప్రమాద హెచ్చరికలను జారీచేశారు. ఎలాంటి పరిస్ధితి ఎదురైనా నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. 
 
కాలిఫోర్నియా ఈశాన్య ప్రాంతంలో 100 అడుగుల ఎత్తుకు మంటలు ఎగసి పడుతున్నట్లు స్ధానిక అటవీ అధికారి కాక్స్ తెలిపారు. ఇప్పటికే 72కిలోమీటర్ల పరిధిలోని వృక్ష సంపదమొత్తం అగ్నికి ఆహుతై బూడిదైనట్లు చెప్పారు. వేడిగాలులు తట్టుకోలేని వారు నివాసాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు.
 
అడవిలో కార్చిచ్చు కారణంగా అనే వన్యజీవులు ప్రాణాలు కోల్పోగా మరికొన్ని ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వలసవెళుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాటిని సంరక్షణకు అన్ని రకాల చర్యలను అధికారులు చేపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు