స్పెయిన్‌లో నగ్న హోటల్ ప్రారంభం.. ప్రేమికులు ఖుషీ ఖుషీ.. ఎంట్రన్స్‌లోనే?

మంగళవారం, 4 జులై 2017 (11:01 IST)
స్పెయిన్ దేశంలో డి లియోనార్డిస్ పేరుతో నగ్న హోటల్ ప్రారంభమైంది. ఈ హోటల్ లోనికి ప్రేమికులు, దంపతులను మాత్రమే అనుమతిస్తారు. ఈ హోటల్ లోపలి వెళ్లాలంటే.. ఎంట్రన్స్‌లోనే కస్టమర్లు తమ దుస్తులను విప్పి.. హోటల్ నిర్వాహకుల వద్ద అప్పగించాలి. అంతేగాకుండా.. సెల్ ఫోన్లను కూడా ఇచ్చేయాలి. సైలెంట్‌గా ఆహార పదార్థాలు టేస్ట్ చేసేందుకు వీలుగా సెల్ ఫోన్లను ఇవ్వడం చేయాలి. 
 
హోటల్‌లోనికి వెళ్లగా ప్రేమికులు లేదా దంపతులు క్యాండిల్ వెలుగులో టేబుళ్లపై ఆసీనులై.. ఆహార పదార్థాలను ఆర్డర్ చేయొచ్చు. సర్వర్ కూడా ఇక్కడ నగ్నంగానే కనిపిస్తారు. కస్టమర్లు కోరిన ఆహారాన్ని టేబుల్‌కు సర్వ్ చేస్తారు. ఈ హోటల్‌కు వచ్చేందుకు దంపతులు వచ్చేందుకు మోస్తరుగా ఆసక్తి చూపుతున్నా.. ప్రేమికులు మాత్రం ఈ హోటల్‌కు వెళ్లేందుకు ఎగబడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి