పాకిస్థాన్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పాకిస్థాన్‌లో గాయకురాలు, ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్న రేష్మ భర్త చేతులారా దారుణంగా హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఆమె భర్తే తుపాకీతో ఆమెను కాల్చి చంపేసినట్లు అనుమానిస్తున్నారు. ఖైబర్ ఫక్తుఖ్వా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గాయనిగా మాత్రమే కాకుండా, పాకిస్థాన్‌లో ఫేమస్ అయిన ''జోబల్ గోలునా'' డ్రామాలో నటించీ రేష్మ తన అభిమానులను మెప్పించింది.
వివరాల్లోకి వెళితే.. నౌషేరా కలాన్ ప్రాంతంలోని హకిమాబాద్ ప్రాంతంలో తన సోదరుడితో ఆమె ఉంటుండగా, ఇంట్లోకి దూసుకొచ్చిన ఓ వ్యక్తి ఆమెపై కాల్పులు జరిపి పారిపోయాడని పాకిస్థాన్ మీడియా పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు ఆమె భర్తేనని తెలుస్తోంది. నిందితుడికి రేష్మ నాలుగో భార్య.