తల దించుకున్న నవాజ్ షరీఫ్... ప్రపంచ దేశాలు పాక్ పైన దండయాత్ర చేస్తాయా...?

గురువారం, 22 సెప్టెంబరు 2016 (19:46 IST)
ఈసారి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చెప్పిన మాటలను ప్రపంచ దేశాలు అస్సలు పట్టించుకోలేదు. కాశ్మీర్ అంశం అంతర్జాతీయ అంశం అంటూ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు పసలేనివన్నట్లు కనీసం దానిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాల్లో పాల్గొనడానికి వెళ్లిన నవాజ్ కాశ్మీర్ అంశాన్ని అమెరికా, బ్రిటన్, జపాన్, టర్కీ దేశాల నాయకుల వద్ద ప్రస్తావించారు. కాశ్మీర్ సమస్యపై జోక్యం చేసుకోవాలంటూ ఆయన చేసిన విన్నపాన్ని వారు ఎంతమాత్రం పట్టించుకోలేదు. పైపెచ్చు దీనిపై కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 
 
మరీ షరీఫ్‌కు మంటపుట్టించే విషయం ఏంటంటే... ఐరాస సారథి బాన్ కీ మూన్ కూడా కాశ్మీర్ అంశం గురించి మాట్లాడలేదు. దీనితో నవాజ్ షరీఫ్ కొత్త పల్లవి అందుకున్నారు. దక్షిణాసియాలో శాంతి స్థాపన విషయంలో ప్రపంచ దేశాలు కృషి చేయడం లేదంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తమ్మీద చూస్తే అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ దేశం ఒంటరిగా మిగిలిపోయే రోజులు మరెంతో దూరంలో లేనట్లు కనబడుతోంది. ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ దేశాన్ని పరిగణించి ప్రపంచ దేశాలన్నీ మూకుమ్మడిగా దాడి చేసినా ఆశ్చర్యం లేదేమో అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి