పాకిస్తాన్‌లో వేగంగా విస్తరిస్తున్న కరోనా.. ఆర్మీ పూర్తి మద్దతు

శుక్రవారం, 20 మార్చి 2020 (12:13 IST)
పాకిస్థాన్‌ను కరోనా వణికిస్తోంది. పాక్‌లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు పాకిస్థాన్‌లో 453 కేసులు నమోదైనాయి. ఇద్దరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. గురువారం మాత్రమే పాకిస్థాన్‌లో 23 నుంచి 81కి పెరిగాయి. పంజాబ్‌లో గురువారం 33 నుంచి 78కి కరోనా కేసులు పెరిగాయి.
 
సింధ్ ప్రావిన్స్‌లో ఇప్పటి వరకు 245 కేసులు నమోదయ్యాయి. ఖైబర్ ఫక్తూంఖ్వా‌లో 23, ఇస్లామాబాద్‌లో 2, పీవోకే, గిల్గిత్ బాల్టిస్థాన్‌24 మందికి కరోనా సోకింది. ఈ సందర్భంగా పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికార్ మీడియాతో మాట్లాడుతూ, కరోనాను ఎదుర్కొనే క్రమంలో సివిల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు ఆర్మీ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ఎమర్జెన్సీ కేసుల కోసం ఆర్మీ మెడికల్ ఫెసిలిటీస్‌ను వాడుకోవచ్చని తెలిపారు.
 
ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వైద్య సలహాదారుడు డాక్టర్ జాఫర్ మీర్జా మీడియాతో మాట్లాడుతూ, కరోనా విస్తరించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పాకిస్థాన్ డాక్టర్లకు చైనా డాక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నారని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు