కరోనా మహమ్మారి ప్రజారోగ్యాన్ని హరించేందుకు చైనాయే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్రాగన్‌పై విరుచుకుపడ్డారు. కరోనా వైరస్‌పై కొద్దినెలలు ముందుగా మనకు సమాచారం ఉంటే బాగుండేదని, చైనాలో ఈ వైరస్ పుట్టుకొచ్చిన ప్రాంతానికే దాన్ని కట్టడి చేసి ఉండాల్సిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎన్‌ఎస్‌సీ) చేసిన ట్వీట్‌పై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీ కరోనా వైరస్‌పై ప్రాథమిక వివరాలను బయటకు పొక్కకుండా నొక్కివేసిందని, దీంతో ఈ మహమ్మారిని నిరోధించే అవకాశం చైనా, అంతర్జాతీయ వైద్య నిపుణులకు లేకుండా పోయిందని ఎన్‌ఎస్‌ఈ చేసిన ట్వీట్ కలకలం రేపింది.
ఇక ఈ వైరస్ గురించి ముందుగా తెలిసిన వారు దాన్ని అక్కడే నిలుపుదల చేసి ఉండాల్సిందని, వారు చేసిన పనికి ఇప్పుడు ప్రపంచమంతా వైరస్ బారిన పడి విలవిలలాడుతోందని, ఇది సరైంది కానేకాదని చైనా తీరును ట్రంప్ తప్పుపట్టారు.