చైల్డ్ కిల్లర్స్, రేపిస్టులకు ఉరిశిక్ష విధించడమే కాదు, వారిని బహిరంగంగా ఉరి తీయాలని పాకిస్థాన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అలీ ముహమ్మద్ ఖాన్ అక్కడి అసెంబ్లీలో తీర్మానాన్ని సమర్పించారు. ఈ తీర్మానాన్ని మెజారిటీ శాసనసభ్యులు ఆమోదించినప్పటికీ.. ప్రభుత్వం దీన్ని సమర్థించలేదని మానవ హక్కుల మంత్రి షిరీన్ మజారి తెలిపినట్టు సమాచారం.