ఆ షాక్ నుంచి తేరుకునేలోపే సాయుధులు ఆమెను చుట్టుముట్టారు. 'ఇప్పుడు చెయ్యగలవా డాన్స్..' అని కోపంగా బిగ్గరగా అరుస్తూ తుపాకులతో నటి కాళ్లు, చేతులు, పొట్టభాగంలో విచక్షనారహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. స్థానికులు నటిని, ఆమె డ్రైవర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే తీవ్ర రక్తస్రావంతో ఆమె కన్ను మూసింది. ఈ దారుణం లాహోర్ నగరంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.
కిస్మత్ మాజీ ప్రియుడు, ఫైసలాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రాణాపాయస్థితి నుంచి బయటపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 'ఇక నువ్వు డాన్స్ ఎలా చేస్తావో చూస్తాం..' అని హంతకులు మాట్లాడటాన్నిబట్టి ఇది ప్రతీకార హత్యగా భావిస్తున్నారు. దీంతో మాజీ ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.