పాకిస్థాన్ గుట్టురట్టు అయ్యింది. ఆప్ఘనిస్థాన్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్ గురించి తెలుసుకుంటే.. పాక్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని తెలుస్తోంది. నాలుగైదు రోజుల క్రితం.. ఆఫ్ఘనిస్థాన్ భద్రతా దళాలకు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది ఒకడు పట్టుబడ్డాడు. ఆ ఉగ్రవాదిని విచారించగా.. పలు షాకింగ్ విషయాలు బయటపడ్డాయని.. ఆఫ్ఘన్ ప్రభుత్వం వెల్లడించింది.
ఈ క్రమంలో ఒక ఉగ్రవాదిని మాత్రం భద్రతా బలగాలు సజీవంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. అంతేకాదు.. మృతిచెందిన ఉగ్రవాదుల వద్ద నుంచి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇక పట్టుబ్డడ ఉగ్రవాదిని విచారించగా.. తాను ఆఫ్ఘన్‌కు రావడం ఇదే తొలిసారంటూ.. పలు సంచలన విషయాలు చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. తాను పాకిస్థాన్‌లో నాలుగు నెలలపాటు శిక్షణ పొందినట్లు తెలిపాడు.