అయితే, ఈ దాడిలో 11 మంది సైనికులు మాత్రమే చనిపోయారని పాక్ ఆర్మీ చెబుతోంది. ఈ మేరకు పాక్ హోం శాఖ ఒక ప్రకటన చేసింది. అయితే, ఈ ప్రకటనను బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దీన్ని ఖండించింది.
పాక్ హోం శాఖ అబద్ధాలు చెబుతుందని, ఈ దాడిలో వంద మందికిపైగా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు ప్రకటించింది. పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్ ప్రాంతాన్ని వేరు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ దాడి చేసినట్టు బీఎల్ఏ ప్రకటించింది.