పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు రికార్డు సృష్టించారు. బోయింగ్ 777 విమానాన్ని అలవోకగా నడిపేశారు. ఆ అక్కా చెల్లెళ్ళ పేర్లు మరియం మర్యాం మసూద్, ఎరుమ్ మసూద్. వీళ్లిద్దరూ కూడా 'పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్' (పీఐఏ)లో పైలట్లుగా రకరకాల విమానాలను నడిపేశారు. వారు ప్రస్తుతం లాహోర్ నుంచి కరాచీ, మాంచెస్టర్, న్యూయార్క్, లండన్‌లకు పీఐఏ విమానాలను నడుపుతున్నారు.
ఈ పరిస్థితుల్లో బుధవారం బోయింగ్‌ను కలిసి నడిపిన సోదరీమణులుగా పీఐఏలో చరిత్ర సృష్టించారు. కాక్‌పిట్‌లో అక్కాచెల్లెళ్లిద్దరూ కూచుని ఇలాంటి ఘనత సాధించడం మాకు గొప్పవార్త అంటూ పీఐఏ అధికారులు సంబరపడిపోతున్నారు. గతంలో కూడా పాకిస్థానీ మహిళలు విమానయాన రంగంలో గొప్పగౌరవాన్నే సముపార్జించారు. 2006లో ఏడుగురు మహిళలు పాకిస్థాన్ వైమానిక దళంలో యుద్ధవిమాన పైలట్లుగా తమ సత్తా చాటారు.