గతంలో ఓ ఐటెం సాంగ్‌పై పాకిస్థాన్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్‌తో రబీ వాగ్యుద్ధానికి దిగడంతో... ఆయనే ఆమె వీడియోలు లీక్ చేశారని నెటిజన్లు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. దీని వెనుక పిర్జాదా మాజీ ప్రియుడి హస్తం కూడా ఉండవచ్చునని మరికొందరు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ వివాదానికి కారణమై దోషులపై నెటిజన్లు రెండుగా చీలిపోయినట్టయింది.
అయితే, రబీ మాజీ ప్రియుడే ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు. 'రబీ ఫిర్జాదా వీడియోలను ఆమె మాజీ బాయ్‌ఫ్రెండే లీక్ చేశాడు. అతడి వద్దే ఆమె ఐక్లౌడ్ పాస్వార్డ్ ఉంది. ఈ వీడియోలను షేర్ చేసుకోకండి' అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. 'అసిఫ్ గఫూర్ని విమర్శించిన గంట సేపట్లోనే ఆమె వీడియోలు, ఫోటోలు లీక్ అయ్యాయి' అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.