తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పాకిస్థాన్‌లోని క్వెట్టాకు చెందిన ఓ గర్భిణి పురిటినొప్పులతో ఆస్పత్రిలో చేరింది. ఆమెకు ఓ మహిళా డాక్టర్ ఆపరేషన్ చేసింది. డెలివరీ సమయంలో శిశువును బయటకు తీసే క్రమంలో తలను మాత్రం బయటకు తీసి మొండెంను గర్భంలోనే వదిలేసింది. దీంతో శిశువు బయటకు రాకముందే ప్రాణాలు కోల్పోయింది.
పైగా, బిడ్డ మొండాన్ని తల్లి కడుపులోనే ఉంచడమేకాకుండా.. తర్వాత ఆపరేషన్ కోసం సివిక్ ఆస్పత్రికి వెళ్లాలని ఆ ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్లు బాధితురాలి కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో ఆమెను సివిక్ ఆస్పత్రికి ఆసుపత్రికి తరలించారు. అక్కడ సర్జికల్ ఆపరేషన్ చేసి తల్లి గర్భంలో నుంచి మొండాన్ని బయటకు తీశారు.