పాకిస్థాన్‌లో మరోదారుణం జరిగింది. పెళ్లి పార్టీలో డాన్స్ చేయలేదన్న కోపంతో గర్భందాల్చివున్న గాయనిని కాల్చి చంపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దారుణం సింధ్ ప్రావిన్స్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
సింధ్ ప్రావిన్స్‌లోని జరిగిన ఓ వెడ్డింగ్ పార్టీకి 24 ఏళ్ల సమినా సింధు అనే గాయని పాటలు పాడేందుకు వెళ్లింది. అయితే ఆమె గర్భిణి కావడం వల్ల కేవలం పాటలు మాత్రమే పాడింది. కానీ, పెళ్లిపార్టీకి వచ్చిన కొందరు ఆమెను డాన్స్ చేయమని ఒత్తిడి తెచ్చారు. దీనికి ఆమె నిరాకరించింది.
ఇంతలో పెళ్లికి వచ్చిన ఓ అతిథి ఫుల్లుగా తాగి ఆ డిన్నర్ పార్టీకి వచ్చాడు. డాన్స్ చేయాలంటూ ఆ సింగర్‌ను అతను అడిగాడు. ఆమె నిరాకరించడంతో అతను ఫైరింగ్ చేశాడు. ఆ కాల్పుల్లో గాయపడిన సింగర్ సింధు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దర్ని అరెస్టు చేశారు.