మహిళలపై యాసిడ్ దాడులు... ఇటీవల ఎక్కడ చూసిన ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇది అందుకు భిన్నం. పెళ్లికి అంగీకరించలేదని ప్రియుడి ముఖంపై ప్రియురాలు యాసిడ్ పోసింది. ఈ ఘటన పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో చోటుచేసుకుంది. పాకిస్థాన్‌లో మహిళలపై మగవాళ్లే కాదు మగవాళ్లపై మహిళలూ హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్నారు.
ఓ యువకుడిపై జరిగిన యాసిడ్ దాడే ఇందుకు సాక్ష్యం. అదికూడా నలుగురిని పెళ్లి చేసుకుని, వారితో విడిపోయి ఇంకో వ్యక్తిని ప్రేమించి.. అతడు పెళ్లికి నిరాకరించాడన్న కోపంతో అతనిపై యాసిడ్ పోసిన ఈ మహిళ సాహసాన్ని చూసి నవ్వాలో... ఏడ్వాలో అర్థం కావట్లేదు. ఈ ఘటనలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడు ఆసుపత్రిలో స్థానికుల సహాయంతో చికిత్స పొందుతున్నాడు.
ఈ వివరాలను పరిశీలిస్తే.. మోమ్లీ మాయ్ అనే మహిళ అదే ప్రాంతానికి చెందిన సద్దాఖ్ అలీ (25) అనే వ్యక్తితో కొన్నేళ్లుగా కలిసి సహజీవనం చేస్తుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీరిద్దరికీ ఇంతకుముందే పెళ్లిళ్లు అయ్యాయి. చేసుకున్న పెళ్లిళ్లను పెటాకులు చేసుకుని ఇద్దరూ కలిసి ఒకే గదిలో ఉంటున్నారు. కాగా ఒకరోజు మాయ్ ఆ వ్యక్తితో ఇన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నాం, కలిసి జీవిస్తున్నాం.. ఇకనైనా తనను రెండో భార్యగా స్వీకరించాలని కోరింది. అయితే అలీ పెళ్లి చేసుకోవడం కుదరదని నిరాకరించాడు.
ముస్లింలలో బహుభారత్వం చట్టబద్ధమే అయినా.. పెళ్లయిన మహిళ మళ్లీ పునర్వివాహం చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా విడాకులు తీసుకోవాల్సిందే. అలీ ఇదే విషయాన్ని చెప్పి తప్పించుకుంటూ తిరిగాడు. క్రమంగా ఇద్దరి మధ్య పెళ్లి విషయమై పెద్ద యుద్ధమే జరిగింది. ఆవేశంతో రగిలిపోయిన మోమ్లీ అలీని చంపాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో యాసిడ్‌తో అతడిపై దాడి చేసింది. బాధితుడు వెనక్కి తిరిగిఉండడంతో అదృష్టవశాత్తు ముఖం మీద పడకుండా శరీరం మీద పడి పడింది.
దాదాపు శరీరం పూర్తిగా యాసిడ్‌తో కాలి గాయాలయ్యాయని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అలీని కాపాడటానికి తమ వంత ప్రయుత్నిస్తున్నామని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు మామ్లీపై కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. యాసిడ్ దాడులు ఎక్కువగా మహిళలపై జరుగుతాయని కానీ, ఈ కేసులో మాత్రం ఒక మహిళ పురుషుడిపై యాసిడ్ దాడి చేసిందని పేర్కొన్నారు.