ఓ మహిళ జపాన్ రాజధాని టోక్యోకు సమీపంలోని నరిటా నుంచి దుబాయ్‌కు ఎమిరేట్స్ విమానంలో బయలుదేరింది. 12 గంటల విమాన ప్రయాణంలో ఆ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఎమిరేట్స్ సిబ్బంది వెంటనే స్పందించి అత్యవసరమైన వైద్య సాయం అందించారు. దీంతో విమానంలో నింగిలో ప్రయాణిస్తుండగానే ఆ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆ విమాన సంస్థ తాజాగా వెల్లడించింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపింది.
కాగా, విమానం గాల్లో ఉన్న సమయంలో మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తినప్పటికీ విమానం మాత్రం నిర్ణీత సమయానికే దుబాయ్ ఎయిర్‌పోర్టుకు చేరుకుందని తెలిపారు. ఆ తర్వాత తల్లిబిడ్డను అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. తమ సిబ్బందితో పాటు ప్రయాణికుల ఆరోగ్యం, భద్రత తమకు చాలా ముఖ్యమని ఎమిరేట్స్ సంస్థ తెలిపింది.