26 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి: శ్రీలంక
బుధవారం, 16 డిశెంబరు 2020 (06:23 IST)
శ్రీలంక కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 26 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను అనుమతించనున్నట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ శ్రీలంక (సీఏఏఎస్ఎల్) ప్రకటించింది.
చార్టెడ్ విమానాలతోపాటు వాణిజ్య విమాన కార్యకలాపాలు కూడా ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా ఎనిమిది నెలల తర్వాత శ్రీలంక అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఓకే చెప్పింది.
శ్రీలంకలో ఉన్న రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలను మార్చి మధ్యలోనే మూసేశారు. అక్టోబర్ లోనే శ్రీలంకలో కరోనా రెండవ వేవ్ వచ్చింది. అందుకే పలు దేశాలకు చెందిన వారిని వెనక్కి పంపే ప్రక్రియను కూడా వాయిదా వేసింది.