ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్‌పై ప్రపంచ దేశాల్లో వ్యతిరేకత అధికమవుతోంది. నిన్నటికి నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక కిమ్ జోంగ్ వ్యవహారాలను సహించలేదనగా, తాజాగా పిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె కిమ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనో పిచ్చోడని, చెత్త నా.. తిట్టిపోశారు.
ఉత్తర కొరియా దీర్ఘకాలిక క్షిపణుల పరీక్షలపై ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో అంతర్జాతీయ సమావేశం జరగడానికి కొన్ని రోజుల ముందు రోడ్రిగో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇంకా ఉత్తర కొరియాతో సంబంధాలున్న అన్ని దేశాల మంత్రులు వచ్చే వారం మనీలాలో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ క్షిపణి పరీక్షలపై చర్చించనున్నారు. అమెరికాను తాకగలిగే అణు క్షిపణిని అభివృద్ధి చేసే పనిలో నార్త్ కొరియా ఉందని తెలిసింది.