హిరోషిమా నగరంలో 42 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహం

శనివారం, 20 మే 2023 (14:07 IST)
Narendra modi
జపాన్‌లోని హిరోషిమా నగరంలో శాంతికి చిహ్నంగా మహత్మా గాంధీ విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం ఆవిష్కరించారు. జి-7 శిఖరాగ్ర సదస్సు కోసం ప్రధాని మోదీ శుక్రవారం జపాన్ చేరుకున్నారు. హిరోషిమాలో శనివారం ఆయన 42 అడుగుల మహాత్మా గాంధీ బస్ట్ సైజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. 
 
మహాత్ముని విగ్రహాన్ని హిరోషిమాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినందుకు, దాన్ని ఆవిష్కరించడానికి తనను ఆహ్వానించినందుకు జపాన్ ప్రభుత్వానికి ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. 
 
ఇకపోతే.. 1945 ఆగస్టు 6న హిరోషిమాపై అమెరికా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అణుబాంబుతో దాడి చేసింది. ఈ దాడిలో నగరం యావత్తు ధ్వంసం కాగా 1,40,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు