ఈ సందర్భంగా వారిద్దరూ ముద్దులు పెట్టుపెట్టుకోవడమే కాకుండా, ఆలింగనం చేసుకున్నారు. అంతర్ మత సమావేశంలో ఈ ఘట్టం చోటుచేసుకుంది. ప్రపంచ శాంతి కోసం పరస్పరం చేతులు కలపాలని ముస్లిం సమాజానికి ఇటీవలే పిలుపునిచ్చిన పోప్ యూఏఈలో పర్యటిస్తున్న విషయం తెల్సిందే.
మానవాళికి సంబంధించి ప్రపంచ శాంతి కోసం, పరస్పర సహజీవనం కోసం చేసుకున్న ఈ ఒప్పంద పత్రం క్రిస్టియన్లు, ముస్లింల మధ్య చర్చలకు ముఖ్యమైన ముందడుగుగా వాటికన్ అభివర్ణించింది. మత విశ్వాసాలలో స్వేచ్ఛ, సహన సంస్కృతి పెంపుదల, ప్రార్థనా స్థలాల పరిరక్షణ, మైనార్టీలకు పూర్తిస్థాయి పౌరసత్వం వంటివి ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలుగా ఉన్నాయి.