సాధారణంగా నిరాశ్రయులైన కొందరు మహిళలు డబ్బు కోసం వ్యభిచారం చేస్తుంటారు. ఈ వ్యభిచారం పలు దేశాల్లో నేరం. మరికొన్ని దేశాల్లో వ్యభిచార వృత్తికి చట్టబద్ధత ఉంది. అయితే, ఫ్రాన్స్ మాత్రం వ్యభిచారం నేరం కాదు కానీ, వ్యభిచారిణులకు డబ్బులు ఇవ్వడం మాత్రం నేరం. శృంగారం కోసం డబ్బులు చెల్లించే కస్టమర్లపై ఆ దేశం భారీ జరిమానా విధిస్తుంది.
నిజానికి ప్రస్తుతం ఫ్రాన్స్‌లో వ్యభిచారానికి చట్టబద్ధత ఉంది. కానీ వ్యభిచార గృహాల ద్వారా, మైనర్ల సెక్స్‌ను ఫ్రాన్స్ చట్టవ్యతిరేకంగా భావిస్తుంది. కొత్త చట్టం ప్రకారం శృంగారాన్ని కొనే కస్టమర్‌కు 2500 డాలర్ల జరిమానా విధించనున్నారు.