డొనాల్డ్ ట్రంప్- కమలా హ్యారిస్‌లకు విడి విడిగా లేఖ రాసిన రాహుల్

సెల్వి

శుక్రవారం, 8 నవంబరు 2024 (12:07 IST)
Rahul Gandhi
అమెరికా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ట్రంప్ విజన్‌పై కోట్లాదిమంది అమెరికన్లు ఎంతో విశ్వాసం ఉంచారని, దాని ఫలితంగానే అత్యంత భారీ మెజారిటీతో గెలిచారని ప్రశంసించారు. ఇంకా డొనాల్డ్ ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు భారత్- అమెరికా మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న సత్సంబంధాలు మరింత బలోపేతమౌతాయని రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. ఈ రెండు దేశాలు చిత్తశుద్దితో ప్రజాస్వామ్య విలువలను కాపాడుతాయని, పరస్పర సహకారంతో సమగ్రాభివృద్ధి సాధించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. 
 
ఈ ఎన్నికల్లో ఓడిపోయిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కూ విడిగా లేఖ రాశారు రాహుల్ గాంధీ. ఈ ఎన్నికల్లో స్ఫూర్తిదాయక పోరాటం చేశారని కొనియాడారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు