ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, బంగ్లాదేశ్‌ల్లో ఐఎస్ దాడులు పెచ్చరిల్లిన నేపథ్యంలో ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు తన చేతిలో దొరికితే పిడి గుద్దులతో చంపేస్తానని కండలవీరుడు, ఇతని పేరు సాజద్ ఘరీబీ ప్రకటించాడు. తనకు 24 సంవత్సరాలే అయినప్పటికీ బరువు మాత్రం 155 కిలోలు ఉంటాడు. భారీ శరీరంతో దాదాపు హల్క్ మాదిరే ఇరానీ హెర్కులెస్ ఉన్నాడు.
ప్రస్తుతం ఇతను నివసించే ఇరానీ దేశీయ సైనికులకు, ఐఎస్ ఉగ్రవాదులకు పోరుతో అనేక మంది సైనికులు, ప్రజలు మృతి చెందుతున్నారు. దీనిని ఏమాత్రం సహించలేని బాహుబలి సాజద్ తన దేశంలో మళ్లీ శాంతి నెలకొనాలనుకుంటున్నాడు. దేశంలో శాంతిభద్రతలు నెలకొనాలంటే ఐఎస్‌ను అంతం చేయక తప్పదన్నాడు. దీనికోసం ఇరానీ సైన్యంలో చేరతానని తెలిపాడు. యుద్ధభూమిలో సైనికులతో కలిసి ఐఎస్ అంతుచూస్తానంటున్నాడు.