ఇందులోభాగంగా, ఆయన ఎత్తు కూడా తెరపైకి వచ్చింది. అలాగే, వ్యక్తిగత జీవితంతో పాటు ఎవరికీ తెలియని అనేక అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా బ్రిటన్ మీడియా ఒక ఆసక్తికరమైన వార్తను ప్రచురించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత పొట్టి వ్యక్తి బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని పేర్కొంది. ఆ ఘనత కూడా రిషి సునక్‌కే దక్కింది.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ప్రధానిగా ఉన్న విన్‌స్టన్ చర్చిల్ ఎత్తు 5.5 అడుగులు. ఆ తర్వాత బ్రిటన్ ప్రధానులు అయిన వారంతా 5.7 అడుగులు పైబడినవారే. ఇపుడు రిషి సునక్ ఎత్తు 5.6 అడుగులు. దీంతో అది కాస్త సంచలన వార్తగా మారిపోయింది. మార్కరెట్ థాచర్, లిజ్ ట్రస్‌ల ఎత్తు 5.5 అడుగులే అయినప్పటికీ వారిద్దరూ మహిళలు కావడంతో వారిని ఎత్తును ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
ఇదిలావుంటే, యూరప్ దేశాల్లో ప్రస్తుతం 5.7 అడుగులు, అంతకంటే పొడవున్న దేశాధినేతలు నలుగురు మాత్రమే ఉన్నారు. వారిలో రిషి సునక్ (5.6 అడుగుల ఎత్తు), ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ (5.7 అడుగులు), జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ (5.5 అడుగులు), ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ (5.5 అడుగులు).