రష్యాలో కరోనా విజృంభణ.. వ్యాక్సిన్‌ను కనుగొనడం కష్టమేనట

సోమవారం, 4 మే 2020 (15:05 IST)
ప్రపంచంలోనే అతి పెద్ద దేశం రష్యాలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. వరుసగా పదివేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదైనాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,581 మందికి కరోనా సోకగా..76 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 145,268కు పెరిగింది. ఇప్పటి వరకూ కరోనా వల్ల 1,356 ప్రాణాలు కోల్పోయారు.
 
చైనా, టర్కీ, ఇరాన్‌ దేశాల తర్వాత అత్యధిక కరోనా బాధితులున్న దేశం రష్యానే కావడం గమనార్హం. కరోనా తీవ్రత ఎక్కువగా దేశాల జాబితాలో రష్యాది ఏడోస్థానం. ఇకపోతే.. రోజురోజుకు బాధితుల సంఖ్య వేలల్లో పెరుగుతుండటంతో దేశప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాజధాని మాస్కోలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి.
 
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా కనుగొంటామన్న గ్యారెంటీ ఏమీ లేదని, అసలు ఎప్పటికీ వ్యాక్సిన్‌ కనుక్కోలేక పోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థకు ప్రత్యేక దౌత్యవేత్తగా పనిచేస్తోన్న లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ డేవిడ్‌ నాబర్రో అన్నారు. మన శాస్త్రవేత్తలు ఓ యాంత్రిక వ్యవస్థలో కొత్త పరికరం కోసం పని చేయడం లేదని, జీవ వ్యవస్థపై పని చేస్తున్నందున విజయానికి గ్యారెంటీ ఇవ్వలేమని ఆయన చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు