Dulquer Salmaan, Bhagyashree Borse
దుల్కర్ సల్మాన్ పీరియాడికల్ మూవీ 'కాంత' టీజర్‌తో సంచలనం సృష్టించింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.