ఇందులో తిరుమూర్తి మాట్లాడుతూ, ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌లో పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారని గుర్తుచేశారు.
ఆ దేశంలోని మానవతా పరిస్థితులపై భారత్ ఆవేదన వ్యక్తం చేస్తుందని, ఉక్రెయిన్ ప్రజలకు మానవతా దృక్పథంతో సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమస్యను రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య దౌత్య విధానాలు, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.