ఉదయాన్నే చావును వెతుక్కుంటూ వెళ్లిన నటి (Video)

ఠాగూర్

బుధవారం, 4 డిశెంబరు 2024 (11:01 IST)
సముద్రపు ఒడ్డున రాతిబండలపై కూర్చొని యోగా చేస్తున్న ఓ నటిని రాక్షస అలలు మింగేశాయి. ఓ పెద్ద అల రావడంతో ఆమె కొట్టుకునిపోయింది. దీంతో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సముద్రంలో గల్లంతైన 23 యేళ్ల యువ నటి కోసం పోలీసులు గాలిస్తున్నారు. థాయ్‌లాండ్‌లోని ప్రముఖ విహార ప్రదేశంలో ఈ విషాదకర ఘటన జరిగింది. 
 
రష్యాకు చెందిన 23 యేళ్ల కెమిల్లా బెల్యాట్స్కాయ (24)‌ అనే సినీ నటి ప్రముఖ విహార ప్రదేశం కో స్యామ్యూయ్‌ ద్వీపానికి తన ప్రియుడితో కలిసి ఇటీవల వెళ్లింది. బీచ్‌ ఒడ్డున తనకు ఇష్టమైన స్థలంలో యోగా చేసేందుకు ఒంటరిగా కారులో అక్కడకు వెళ్లింది. కెమిల్లా గతంలోనూ పలుమార్లు అక్కడికి వచ్చింది. అయితే, సంఘటన జరిగిన రోజు యోగా మ్యాచ్ తీసుకుని సముద్రం ఒడ్డున చదునుగా ఉన్న ఓ పెద్ద బండరాయిపై కూర్చొని యోగా చేస్తున్న సమయంలో ఒక్కసారిగా సముద్రంలోని అలలు ఎగిసిపడ్డాయి. 
 
ఈ క్రమలో ఓ పెద్ద అల ఆమెను సముద్రంలోకి లాక్కెళ్లింది. చాలా సేపటికి వరకు ఆమె సముద్రంలో అలల మధ్య చిక్కుకుని ఉన్న దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆమె కొట్టుకునిపోయిన 15 నిమిషాల తర్వాత రెస్క్యూ టీం అక్కడకి చేరుకుంటుంది. సముద్రంలో ప్రమాదకరమైన అలల కారణంగా రెస్క్యూ నిలిపివేశారు. దీంతో వారు ఆమెను కాపాడలేకపోయారు. కాసేపటికి కొన్ని కిలోమీటర్ల దూరంలో నటి మృతదేహం కొట్టుకునివచ్చింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కెమిల్లా సముద్రంలోకి కొట్టుకునిపోతున్న సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

 

Hình ảnh cuối của nữ du khách tập yoga trên mỏm đá trước khi bị sóng cuốn

Một nữ du khách Nga 24 tuổi đã bị sóng cuốn xuống biển khi tập yoga trên mỏm đá tại điểm ngắm cảnh Lad Koh, đảo Koh Samui, Thái Lan vào ngày 29-11. pic.twitter.com/7VYbwevCzM

— South of Vietnam (@vincent31473580) December 1, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు