అగ్నిప్రమాదం జరిగినా రష్యా వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఓవైపు ఆసుపత్రి అగ్ని ప్రమాదానికి గురై మంటలు చెలరేగుతున్నా.. వైద్యులు అత్యవసర పరిస్థితుల్లో సాహసోపేతంగా ఓ రోగికి ఓపెన్-హార్ట్ సర్జరీని పూర్తిచేశారు. రష్యాలోని బ్లాగోవెస్కెన్స్క్లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జార్ల కాలం నాటి ఇక్కడి ఆసుపత్రిలో వైద్యులు శస్త్రచికిత్సను ప్రారంభించిన కొద్దిసేపటికి మంటలు చెలరేగాయి. వైద్య సిబ్బంది ఏమాత్రం బెదిరిపోలేదు.
అదే సమయంలో ఓపెన్-హార్ట్ సర్జరీ చేస్తున్న గదికి అన్నివిధాలుగా సంరక్షణ ఏర్పాట్లు చేశారు. లోపలికి పొగ వెళ్లకుండా పెద్ద ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆ గదికి విద్యుత్తు సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక కేబుళ్లను ఏర్పాటు చేశారు. 8 మంది వైద్యులు, నర్సులతో కూడిన బృందం సర్జరీలో పాల్గొంది.