తాజాగా ఇష్టపడి వివాహం చేసుకున్న భర్తకు విడాకులు ఇచ్చిన ఓ మహిళ.. అంతటితో ఊరుకోకుండా.. మాతృత్వానికి భంగం కలిగించేలా.. ఏకంగా కొడుకునే వివాహం చేసుకుంది. నమ్మినా నమ్మకపోయినా.. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రష్యాలోని క్రాస్నాదర్ క్రాయికి చెందిన 35 ఏళ్ల మరీనా బల్మాషేవా పదేళ్ల కిందట 45 ఏళ్ల అర్రేను పెళ్లి చేసుకుంది. అర్రేకు అప్పటికే పదేళ్ల కొడుకున్నాడు.
మరీనా కూడా అతడిని కన్న కొడుకులా ప్రేమగానే చూసుకొనేది. కానీ భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా అతడికి విడాకులిచ్చేసింది. ఒంటరి జీవితం కొనసాగించింది. కానీ పదేళ్లపాటు ఆమెతోపాటు పెరిగిన కొడుకు వ్లాడిమిర్ మరీనాను వదిలి ఉండలేకపోయాడు. వ్లాడిమిర్‌కు ఇప్పుడు ఇరవై ఏళ్లు. మరీనా తన తండ్రికి విడాకులిచ్చి వదిలేసినా... వ్లాడిమిర్ మాత్రం నిత్యం ఆమెను కలుస్తూనే ఉండేవాడు.
దీంతో తమ మధ్య ఉన్నది తల్లీకొడుకుల బంధం కాదని, దానికి మించినదని మరీనా భావించింది. తన మనసులో మాటను వ్లాడిమిర్‌కు చెప్పింది. అందుకు కుమారుడు కూడా అంగీకరించాడు. దీంతో వాళ్లిద్దరూ ప్రేమను పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
ఈ వార్త విని ఆమె మాజీ భర్తకు గుండె ఆగినంత పనైంది. తన మాజీ భార్య కోడలిగా ఇంటికి తిరిగి వస్తుందని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. కానీ, కొడుకు ఇష్టాన్ని కాదనలేక అయిష్టంతోనే అంగీకరించాడు. ఇలా వారిద్దరి వివాహం జరిగిపోయింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.